Ttd Chairman Yv Subba Reddy Tests Coronavirus Positive
ఏపీలో ప్రజా ప్రతినిధుల్ని కరోనా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు ఈ వైరస్ బారినపడ్డారు. ఒకరిద్దరికి రెండోసారి కరోనా తిరగబెట్టడంతో ఆస్పత్రిలో చేరారు. తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన టీటీడీ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 12న తన ఇంట్లో జరిగిన వేడుకలకు వెళ్లారు.


No comments